మెగాస్టార్ ట్వీట్ కు ప్రభాస్ షాక్..
- August 12, 2019
రాజమౌళి 'బాహుబలి' తరువాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో సాహో రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ప్రభాస్ ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్ర యూనిట్ ఇటీవలే ట్రైలర్ ను గ్రాండ్ గా ముంబైలో రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక డైరెక్టర్ సుజీత్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తనకి వస్తున్న కంగ్రాట్స్ మెసేజెస్ తో బిజీగా ఉన్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడిన రెబెల్ స్టార్ మెగాస్టార్ నుంచి విషెస్ అందుకున్నానని చెప్పారు. చిరంజీవి గారి ట్వీట్ ఓపెన్ చెయ్యగానే షాక్ అయ్యానని వెంటనే కాల్ చేసి మాట్లాడానని అన్నారు. ఇక ఆ ట్వీట్ ఏమిటంటే రాజమౌళి సాహో ట్రైలర్ కోసం ఏలాంటి ట్వీట్ చెయ్యలేదని అడగగా హీరో చిన్నగా నవ్వుతూ జక్కన్న తన దగ్గరవాళ్ళు అనుకున్న వారికి ట్వీట్ చెయ్యడు..ప్రోమో చూసి ఆనందపడతారు అని ప్రభాస్ చెప్పడం జరిగింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







