ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన టీవీ5 స్టాఫ్ రిపోర్టర్
- August 12, 2019
రాజమండ్రి టీవీ5 స్టాఫ్ రిపోర్టర్ తాతాజీ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. గత వారంరోజులుగా గోదావరి పరివాహక ప్రాంతంలోని దేవీపట్నం, కోనసీమ లంక గ్రామాల వరద బాధితుల కష్టాలపై.. ప్రమాదకర పరిస్థితుల్లోనూ నిర్భయంగా రిపోర్టింగ్ చేశాడు. వరద పరిస్థితులపై వాస్తవ చిత్రాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేశాడు. ఐతే.. నిన్న తాతాజీని దురదృష్టం వెంటాడింది. తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయడపడ్డ తాతాజీ ఈ ఉదయం మృతి చెందాడు.
టీవీ 5 రిపోర్టర్ తాతాజీ ద్విచక్రవాహనంపై నిడదవోలు వెళుతుండగా తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తాడేపల్లిగూడెంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్రగాయాలు కావడంతో అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. తాతాజీని కాపాడేందుకు టీవీ5 యాజమాన్యం శతవిధాలా ప్రయత్నించింది. అయినా పరిస్థితి విషమించింది. శరీరం వైద్యానికి స్పందించలేదు. దీంతో ఉదయం మృతి చెందాడు. తాతాజీ మృతి పట్ల టీవీ5 యాజమాన్యం సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..