నేడు అందాల నటి శ్రీదేవి పుట్టిన రోజు
- August 13, 2019
నటన అందం శృంగారం హావభావాల తో కమర్షియల్ గా ఎన్నో విజవంతమైన సినిమాలలో ఆమె నటనకు నీరాజనాలే లభించాయి. అనేక సినిమాలు ఆమె వలననే సూపర్ హిట్ అయ్యాయి. ఎన్.టి.ఆర్ - శ్రీదేవి "ఒక ఆన్ స్క్రీన్ బ్రాండ్ పెయిర్" అలాగే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున తో జట్టు గట్టిన సినిమాలు తెలుగు చిత్ర సీమను ఉర్రూతలూగించాయి.
తన నాలుగేళ్ళ వయసు నుండే బాలనటి గా అనేక అవార్డ్స్ గెలుచుకుంది. తెలుగులో ఎన్.టి.ఆర్ మనవరాలుగా బడిపంతులు సినిమాలో నటించి పేరు ప్రతిష్ఠలు ఘడించింది. అదే శ్రీదెవి 1979 లో ఎన్.టి.ఆర్ వెటగాడు సినిమాలో జోడీ కట్టి ఆ సినిమా బ్లాక్-బస్టర్ గా నిలిచింది. 1976 లో రజనికాంత్ తో ఒక తమిళ సినిమాలో కథానాయకి గా తొలిసారి నటించి ఘనవిజయం స్వంతం చేసుకుంది.
తన అందచందాలతో, హావభావాలతో అన్ని తరాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న శ్రీదేవి
'జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమాలో దేవలోకంలోంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా కనిపించే శ్రీదేవి అంటే ఇష్టపడని వారంటు ఉండరు. శ్రీదేవి అంటే అందం, అభినయం, హుందాతనం, దర్పం, ప్రేమ, త్యాగం, లాలిత్యం.
ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్ లో తాను బసచేసిన హోటల్ గది బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి శ్రీదేవి మరణించింది. ఈమె మరణవార్త విని ఆసేతుహిమాచలం దిగ్భ్రాంతికి గురి అయింది. ఈమెను కడసారి చూడటం కోసం దక్షిణాది నుండి ఎందరో సినీప్రముఖులు, అభిమానులు, బంధువులు ముంబై తరలి వచ్చారు. అశేషమైన అభిమాన జనసందోహం వెంట నడువగా ఫిబ్రవరి 28న ముంబైలో ఈమె అంతిమయాత్ర చిరస్మరణీయంగా జరిగింది. చిత్రసీమలో మూడు దశాబ్దాలపాటు అగ్రనాయికగా వెలుగొంది అప్సరసను తలపించే అందం, అంతకుమించిన అభినయంతో భారతీయుల హృదయాలలో చెరగని ముద్రవేసిన శ్రీదేవి అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరగడంతో ఆమె ఘనతకు తగిన వీడ్కోలు లభించినట్లయింది.




తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







