పెద్దమనసు చాటుకున్న ఆఫ్ డ్యూటీ దుబాయ్ కాప్
- August 13, 2019
దుబాయ్:పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తోన్న వ్యక్తులు ఆఫ్ డ్యూటీలో వున్నప్పుడూ నైతిక బాధ్యతగా విధులు నిర్వహిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. షార్జాలో దుబాయ్ పోలీస్ అధికారి ఒకరు, ఆఫ్ డ్యూటీలో వుండి కూడా ఓ వాహనదారుడికి సాయం చేశారు. టైర్ బరస్ట్ కావడంతో దిక్కు తోచని స్థితిలో రోడ్డుపై వాహనంతో నిలిచిపోయిన ఓ భారతీయ వలసదారుడికి సాయం చేశారు ఆ అధికారి. కేరళకు చెందిన దుబాయ్ రెసిడెంట్ అబ్దుల్ వహాబ్ ఆ సంఘటనను వివరిస్తూ, ఓ పోలీస్ అధికారి తనకు చేసిన సాయాన్ని ఎప్పుడూ మర్చిపోలేనని అన్నారు. నైట్ డ్యూటీ ముగించుకుని వస్తున్న ఓ అధికారి, తన కష్టాన్ని చూసి సాయం చేశారనీ, ఇతరులెవరూ అంత వేడి వాతావరణంలో తనకు సాయం చేసేందుకు ముందుకు రాలేదని అన్నారాయన. అయితే, సదరు అధికారి వివరాల్ని వాహబ్ వెల్లడించలేదు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







