ఆమె కోసం 65 రోజులుగా ఎదురుచూపులు
- August 13, 2019
యూ.ఏ.ఈ:మానసిక స్థితి సరిగ్గా లేని ఓ మహిళ ఆచూకీ కోసం 65 రోజులుగా కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. శ్రీలంకకు చెందిన మహిళ రోహిని పెరీరా 65 రోజులుగా కన్పించడంలేదని ఆమె భర్త మధుసూధనన్ చెప్పారు. ఎక్కడో ఓ చోట ఆమె జీవించే వుంటుందని నమ్ముతున్నామని ఆయన చెప్పారు. మధుసూధనన్ కేరళకు చెందిన వ్యక్తి. జూన్ 9 నుంచి తన భార్య అదృశ్యమయ్యిందని ఆయన వివరించారు. మధుసూధనన్, రోహిణిలకు ఐదుగురు సంతానం. ఈద్ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారికి తన భార్య కనిపించే అవకాశం వుందంటూ తన భార్య ఆచూకీ కోసం అందర్నీ అభ్యర్థిస్తున్నారు మధుసూధన్.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







