అమెరికాలో మోదీ సభకు భారీ సంఖ్యలో దరఖాస్తులు
- August 14, 2019
హ్యూస్టన్:అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా వచ్చే నెల నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రవాసుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి 40వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరో పది వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. దరఖాస్తులు ప్రారంభమైన తొలి రెండు వారాల్లోనే 39వేల మంది తమ ఆసక్తిని తెలియజేసినట్లు తెలిపారు. దాదాపు ఐదు లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్న హ్యూస్టన్‌లో ఖహౌదీ మోదీగ పేరిట ఈ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ నగర మేయర్ సిల్వస్టర్ టర్నర్ మాట్లాడుతూ.. మోదీకి స్వాగతం పలకడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. అలాగే టెక్సాస్‌కు చెందిన సెనేటర్ జాన్ కార్నిన్ సైతం మోదీ రాక పట్ల ఆసక్తి వ్యక్తం చేశారు. భారత్అమెరికా మధ్య మెరుగైన వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. వాటిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అమెరికాలోని అనేక భారతీయ సంఘాలు ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు, సహకారాన్ని అందిస్తున్నాయి. ఇరు దేశాల వాణిజ్య బంధంలో హ్యూస్టన్‌ది కీలక పాత్ర. అందుకే ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







