ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగాలు..

- August 14, 2019 , by Maagulf
ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగాలు..

.ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీకాకుళం జోన్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎస్‌టీ కేటగిరిలో సబ్‌స్టాఫ్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తిగల అభ్యర్థులు 2019 ఆగస్ట్ 31లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు 15…. విజయనగరంలో 9, శ్రీకాకుళంలో 6 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2019 ఆగస్ట్ 31, విద్యార్హత.. కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. పదో తరగతిలో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలి. తెలుగుతో పాటు ఇంగ్లీష్ చదవడం, రాయడం తెలిసి ఉండాలి. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులు పంపించాల్సిన అడ్రస్.. The Zonal Manager, Andhra Bank, HR Department, Zonal Office Srikakulam, Venkatapuram Junction, Near Simhawaram, Srikakulam 532005.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com