ఒమాన్ " ఇ - 44" మార్గంలో ఇక విదేశీయులకు అనుమతి లేదు
- January 07, 2016
ఎమరేట్స్ నుంచి భూమార్గం ద్వారా ఒమాన్ చేరేందుకు ఫీజులను క్రమబద్దీకరించారు. దీని ప్రకారం ఒక వ్యక్తికి 30 దినార్లు ఖర్చుగా నిర్ణయించారు. ఈ మార్గంలో గల్ఫ్ దేశాల సమఖ్యకు చెందిన జాతీయులు ఈ రహదారి మీదుగా తమ తమ ప్రయాణాలను కొనసాగించవచ్చు.
అయితే , ఇదే మార్గంలో ప్రయాణించే విదేశీయులకు అనుమతి లేదు. ఈ దారి ఒమాన్ సరిహద్దు ప్రాంతమైన మాదం మరియు హత్తాకు చేరుతుంది. ఈ మార్గానికి ప్రత్యామ్నయంగా షార్జా కల్బ మీదుగా హత్తాకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలియచేస్తున్నారు. తమ సూచనను కాదని , మాదం దారి మీదుగా విదేశీయులు ఎవరైనా ప్రయాణిస్తే, చెక్ పోస్ట్ వద్ద ఒమాన్ అథారిటీ సిబ్బంది నిర్దయగా ఆపివేయబడి , తిరిగి వెనక్కి పంపివేయబడతారని తెలిపారు. షార్జా కల్బ ప్రాంతాలకు చేరుకోవడానికి మరో దారి ఏమిటంటే, ఆ మాదం మార్గంలో ఎడమ వైపునకు తిరిగి " ఇ - 55 " మార్గం ద్వారా ' అల్ మలైహ ' మీదుగా ముందుకు ప్రయాణించిన తర్వాత ' శావ్క ' మార్గ సూచీ బొర్దును గమనించవచ్చు. అక్కడ కుడి వైపునకు తిరిగి హత్తా 44 ద్వారా , 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి " ఆల్ వజజహ్ " సరిహద్దుకు చేరుకోవచ్చు. ఇది దాదాపు అరగంట ప్రయాణ భారమైనా మంచిది. ఎందుకంటే, అనుమతి లేని ' మాదం మరియు హత్తాకు ' 2 గంటల 45 నిమిషాలు ఏకధాటిగా ప్రయాణించి అక్కడ సరిహద్దు సిబ్బంది వెనక్కి పంపడం కన్నా హత్తా 44 ద్వారా గమ్యం చేరుకోవడం మంచిదని అధికారులు వివరిస్తున్నారు. సెలవులలో, వారాంతంలో అత్యధిక విదేశీయులు ఒమాన్ లో అక్రమంగా జరుగుతున్న ప్రవేశాలను నిలువరించేందుకు ఈ చర్యలను తీసుకుంటనట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







