కొత్తగా ఇళ్లు కొనుగోలుచేసేవారికి 5-7 శాతం తగ్గుతాయ్!
- January 07, 2016
కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న కష్టాలకు ప్రభుత్వం స్వస్తి చెప్పింది. స్థిరాస్తి రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, నిబంధనల సడలింపులపై నిర్మాణ రంగంలోని పలు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా క్రెడాయ్, ట్రెడా, టీడీఏ, టీబీఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో గురువారమిక్కడ 'ప్రభుత్వ పాలసీలు: తెలంగాణలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి అవకాశాలు- సవాళ్లు' అనే అంశంపై సదస్సు జరిగింది.ఈ సందర్భంగా భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ ఎస్ రాంరెడ్డి మాట్లాడుతూ.. ''గతంలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే రెండేళ్లయినా ఫైలు ముందుకు కదిలిదే కాదు. కానీ, ఇప్పుడు 15-20 రోజుల్లోనే అనుమతులను మంజూరు చేస్తామని ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో ప్రాజెక్ట్ వ్యయం 10-15 శాతం మేర తగ్గుతుందని.. అయితే ఈ తగ్గింపు కొత్తగా ఇళ్లు కొనుగోలుచేసేవారికి 5-7 శాతం వరకే ఉంటుందని'' వివరించారు. ఎందుకంటే స్థలం ధరలు, బ్యాంకుల వడ్డీలు, ఇతరత్రా నిర్మాణ సామాగ్రి ధరలు రోజురోజుకూ పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.అనంతరం తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ప్రెసిడెంట్ దశరథ్ రెడ్డి మాట్లాడుతూ.. స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న 44 కీలక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే అందులో 23 సమస్యలను మాత్రమే పరిష్కరించారని.. మిగతా వాటిపై కమిటీని వేసి 3 నెలల్లో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల నిర్మాణ రంగంలో పారదర్శకత నెలకొంటుందని.. ఇదే సమయంలో కొనుగోలుదారులూ జాగురూకత వహించాలని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







