తరుణ్ మళ్లీ సినిమా చేస్తున్నాడు..
- January 07, 2016
ఒకప్పుడు తెలుగులో పలు హిట్స్ ఇచ్చి లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్... తర్వాత వరుస ప్లాపులతో తెర మరుగైపోయాడు. తరుణ్ గురించి సినీ జనాలు పూర్తిగా మరిచిపోతున్నారనుకుంటున్న సమయంలో మళ్లీ ఈ యంగ్ హీరో రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. ఒకప్పుడు ప్రేమకధా చిత్రాలతో తెలుగులో తనదైన మార్క్ క్రియేట్ చేసిన ఈ హీరో కొంత గ్యాప్ అనంతరం మళ్లీ మరో వైవిధ్యమైన లవ్ స్టోరీతొ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రమేష్ గోపి దర్శకత్వంతో రామ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఎస్.వి ప్రకాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తరుణ్ సరన ఓవియా హీరోయిన్ గా నటిస్తోంది. ఓ అమ్మాయిని ఎంత కాలం ప్రేమించామన్నది కాదు. ఎంత బాగా ప్రేమించామన్నదె ముఖ్యం అన్న కాన్సెప్ట్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తరుణ్ పుట్టిన రోజు సందర్బంగా జనవరి 8 న చిత్ర యూనిట్ విడుదల చెస్తున్నారు. నటుడిగా ఆల్ రౌండర్ అన్పించుకున్న తరుణ్ .. మళ్లీ ఈ సినిమాతో ఫామ్ లోకి రావాలని ఆకాంక్షిస్తూ విష్ యు హ్యాపి బర్త్ డే టూ తరుణ్
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









