షాకిచ్చిన అమితాబ్ బిగ్ బి
- August 19, 2019
అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ లో ఒకప్పటి టాప్ హీరో. ఇప్పుడు కూడా టాప్ ఆర్టిస్ట్. దేశం గర్వించే ఎన్నో సినిమాల్లో అమితాబ్ నటించాడు. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. గాంభీర్యమైన వాయిస్ ఆయన్ను హీరోగా నిలబెట్టింది. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకునేలా చేసింది. ఇప్పుడు ఈ హీరో కొన్ని రకాల జబ్బులతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా చెప్పడం విశేషం.
తన లివర్ లో 75 శాతం పాడైపోయిందని, కేవలం 25శాతం లివర్ తో మాత్రమే బ్రతుకుతున్నట్టు తెలిపారు. మనిషికి అన్నింటికంటే ముఖ్యమంగా అవయవం లివర్.. ఇది శరీరంలోని ఎన్నో రకాల జీవన క్రియలను నిర్వహిస్తుంది. ధూమపానం, మద్యపానం చేసే వాళ్లకు లివర్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అన్నది చాల ఖర్చుతో కూడుకొని ఉంటుంది. రిస్క్ కూడా ఎక్కువే.
అమితాబ్ ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో అప్పుడే అయన అభిమానులు షాక్ అయ్యారు. అమితాబ్ కు ఏమైందని అంటూ విచారించడం మొదలుపెట్టారు. అమితాబ్ గతంలో క్షయ, హైపటైటిస్ బి వంటి వ్యాధులతో బాధపడ్డారట. ఈ వ్యాధులు ఉన్నాయని ఆయనకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ తరువాత కఠినమైన నియమాలు పాటించి మెడిసిన్ తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగైనట్టు ఆయన అమితాబ్ చెప్పడం విశేషం.
ఆరోగ్య అవగాహాన కార్యక్రమంలో భాగంగా అమితాబ్ తన ఆరోగ్యం గురించి మీడియాతో పంచుకున్నారు. వైద్యుల వద్దకు వెళ్లినపుడు వారి సమస్యల గురించి తప్పకుండ చెప్పాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వైద్యుల వద్దకు వెళ్లిన తరువాత వాళ్లకు ఉన్న రోగాల గురించి చెప్పకపోతే.. దానివలన అనేక ఇబ్బందులు వస్తాయని... రోగం ముదిరిన తరువాత చికిత్స చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి వివిధ రోగాలపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







