చంద్రుడి కక్ష్యలోకి చేరిన చంద్రయాన్2
- August 20, 2019
యావత్తు దేశం ఆతృతగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయాణం సాఫీగా సాగుతోంది. ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలకఘట్టం విజయవంతంగా ముగిసింది. లూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్-2 ఉపగ్రహం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. మంగళవారం 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అంచనాలను అందుకుంటూ సరిగ్గా 9:20 గంటలకు కక్ష్యలోకి చేరింది. ప్రయోగించిన 29 రోజుల తర్వాత చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి చేరింది.
సెప్టెంబర్ 2వ తేదీన ఉపగ్రహం నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోతుందని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. బెంగళూరు సమీపంలో గల బైలాలులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ యాంటెన్నాల సాయంతో ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ నుంచి ఉపగ్రహ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకు ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడుకున్న విషయమని ఇస్రో చైర్మన్ కె.శివన్ అన్నారు. గత నెల 22న చంద్రయాన్-2ను ప్రయోగించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







