అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం
- August 21, 2019
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇది ఇలావుంటే, ఢిల్లీలోని చిదంబరం ఇంటికి వెళ్లిన సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుతిరిగారు. ఆ తర్వాత వెళ్లిన మరో అధికారుల బృందం చిదంబరం ఇంటికి నోటీసులు అంటించింది.
రెండు గంటల్లోపు సీబీఐ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. బెయిల్ పిటిషన్ రద్దు కావడం, సీబీఐ నోటీసుల నేపథ్యంలో చిదంబరం అరెస్టు తప్పదేమోనన్న చర్చ జరుగుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో చిదంబరం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ప్రతికూలంగా తీర్పు చెబితే చిదంబరం జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







