రాఫెల్ యుద్ధ విమానాన్ని స్వీకరించనున్న రాజ్ నాథ్ సింగ్
- August 22, 2019
న్యూఢిలీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా లు తొలి రాఫెల్ ను స్వీకరించబోతున్నారు. దీంతో భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. ఫ్రెంచ్ ఏవియేషన్ సంస్థ డస్సాల్ట్ నుంచి తొలి రాఫెల్ యుద్ధ విమానం సెప్టెంబర్ 20న భారత్ కు అందనుంది. ఈ విమానాన్ని స్వీకరించడానికి రాజ్ నాథ్, ధనోవాలతో పాటు పలువురు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు ఫ్రాన్స్ కు వెళ్లనున్నారు. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కు ఫ్రాన్స్ అందిచనుంది. 2020 మే నుంచి మిగిలిన విమానాలు ఒక్కొక్కటిగా భారత్ కు చేరుతాయి. ప్రస్తుతం ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల కంటే భారత్ కు అందనున్న విమానాలు మరింత ఆధునికమైనవని అధికారులు తెలిపారు. ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో మన పైలట్లు కొందరు ఇప్పటికే ఆధునాతన రాఫెల్ యుద్ధ విమానాలపై ట్రైనింగ్ పొందారు. 2020 వరకు మొత్తం 24 మంది పైలట్లకు మూడు బ్యాచ్ లలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..