కల్చరల్ ప్రోగ్రామ్స్‌తో ముగియనున్న సలాలా టూరిజం ఫెస్టివల్
- August 22, 2019
మస్కట్: సలాలా టూరిజం ఫెస్టివల్ 2019 ముగింపు దశకు చేరుకుంది. ఆగస్ట్ 23న ముగియనున్న ఈ వేడుకల కోసం ప్రత్యేక కార్యక్రమాల్ని డిజైన్ చేశారు. సంప్రదాయ అల్ బరా కాంపిటీషన్ ఇందులో ఒకటి. ఏడవ ఎడిషన్ ఒమనీ ఫోక్‌లోర్ సాంగ్ కాంపిటీషన్‌కి తోడుగా సంప్రదాయ అల్ బరా కాంపిటీషన్ కూడా జరుగుతుంది. స్థానిక అలాగే జీసీసీ మరియు అరబ్ ఆర్టిస్టులు, నటులు ఈ ప్రోగ్రామ్‌లు పాల్గొననున్నారు. మునిసిపాలిటీ రిక్రియేషన్ సెంటర్ వద్ద జరిగే కార్యక్రమాలకు తోడు, పలు ఇతర ఆకర్షణీయ అంశాలు మరింత ప్రత్యేకంగా ముగింపు వేడుకల్లో సందర్శకుల్ని ఆకట్టుకోనున్నాయి. కాగా, ఈ ఫెస్టివల్‌లో ఎగ్జిబిషన్స్, అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌తోపాటు ప్రైవేటు కంపెనీలు, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్, ఒమనీ విమెన్ అసోసియేషన్స్, క్రాఫ్ట్ సెంటర్స్‌కి మార్కెటింగ్ పెవిలియన్స్‌ని కూడా పొందుపరిచారు. హోలీ కురాన్ మెమొరైజింగ్ కాంపిటీషన్, ఫొటోగ్రఫీ ఫెస్టివల్, ఫైన్ ఆర్ట్స్ కాంపిటీషన్‌ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







