మంచు మనోజ్ పెళ్లి సంబరాలు
- May 15, 2015
మంచు మనోజ్ వివాహ వేడుక.... పెళ్లిలా కాకుండా పండగలా సాగుతోంది. ఈ నెల 20 పెళ్లి జరుగనున్న నేపథ్యంలో పది రోజుల ముందు నుండే పెళ్లి ముందుకు జరుగాల్సిన వివిధ కార్యక్రమాలు మొలయ్యాయి. తాజాగా నలుపు పెట్టి పెళ్లికొడుకును చేసే ఫంక్షన్ సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. ఈ వేడుక పలువురు ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ డిజైన్ శిల్పా రెడ్డి తదితరులు హాజరైన ఈ వేడుకకు మరింత కల తెచ్చారు. ఈ వేడుక పూర్తిగా ప్రైవేట్ పంక్షన్ లా సాగింది. సంగీత్, మెహందీ ఇలా పెళ్లికి ముందు సాగే కార్యక్రమాలన్నీ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు మనోజ్-ప్రణతి వివాహం జరుగబోతోంది. లక్ష్మి మంచు ఇంట్లో మెహందీ సెర్మనీ నిర్వహించనున్నారు. పార్క్ హయత్ హోటల్ లో సంగీత్ కార్యక్రమం జరుగబోతోంది. హైటెక్స్ వివాహ వేడుక గ్రాండ్ గా జరుగబోతోంది. ఈ పెళ్లి వేడుకకు దాదాపు 10వేల మందికి పైగా అథితులు హాజరవుతారని సమాచారం. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంచు మనోజ్ గ్రూమింగ్ సెర్మనీలో మంచు మనోజ్,బాలయ్య, మోమన్ బాబు కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. పెళ్లి వేడుకలో మంచువిష్ణు, వెరానిక ఇలా.... చిరంజీవి, బాలయ్య ఇద్దరూ కలిసి ఈ వేడుకలో సరదాగా గడిపారు. తన కూతురు నిర్వాణతో కలిసి మంచు లక్ష్మి ఇలా... మంచు విష్ణు, మంచు లక్ష్మిలతో కలిసి బాలయ్య సెల్ఫీ... ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి, ఇతర అతిథులతో కలిసి లక్ష్మి
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







