మరో వివాదంలో చిక్కుకున్న డోనాల్డ్ ట్రంప్
- August 31, 2019అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. దేశ రహస్యాలను లీక్ చేస్తున్నారంటూ ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ చేసిన ఓ ట్వీట్, ఈ వివాదానికి కారణమైంది. ఇరాన్ ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విఫలమైందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఐతే, ట్వీట్లో ఆయన పోస్ట్ చేసిన ఫోటో హాట్ టాపిక్ గా మారింది. నిఘా వర్గాలు ఇచ్చిన ఫోటోను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఐబీ ఇచ్చిన సమాచారాన్ని అధ్యక్షుడే లీక్ చేయడమేంటని నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇది బాధ్యతారాహిత్యమని దుయ్యబట్టారు. ఈ విమర్శలను ట్రంప్ తోసిపుచ్చారు. ఇరాన్ ప్రయోగానికి సంబంధించిన సమాచా రాన్ని ప్రజలతో పంచుకునే హక్కు తనకు ఉందంటూ వితండ వాదన చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?