యూఏఈ విజిట్‌ వీసా కన్‌ఫ్యూజన్‌

- January 08, 2016 , by Maagulf
యూఏఈ విజిట్‌ వీసా కన్‌ఫ్యూజన్‌

విజిట్‌ వీసా పునరుద్ధరణపై కన్‌ఫ్యూజన్‌, చాలామంది ప్రయాణీకులపై పడింది. ఉద్యోగార్ధులు సైతం ఈ విధానంతో ఆందోళన చెందుతున్నారు. విజిట్‌ వీసా ఉన్నవారు తమ వీసా స్టేటస్‌ని మార్చుకోవడానికి 570 దిర్హామ్‌లు చెల్లిస్తే సరిపోతుందనే నిబంధననపై గందరగోళం కొనసాగుతోంది. ఈ నిబంధన విషయంలో ఇంకా అధికారిక సమాచారం రాలేదని ట్రావెల్‌ ఏజెంట్స్‌ చెబుతుండడంతో, విజిట్‌ వీసా ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ఈ గందరగోళం నడుమ ప్రయాణాల్ని రద్దు చేసుకోవడమే మంచిదని చాలామంది భావిస్తున్నారు. ఈ గందరగోళం కారణంగా ప్రయాణాల్లో 10 నుంచి 15 శాతం తగ్గుదల గడచిన వారంలో నమోదయినట్లు సమాచారమ్‌. అయితే, అబుదాబీ నేషనల్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం సీనియర్‌ ట్రావెల్‌ కన్సల్టెంట్‌ బిలాల్‌ చౌదరి మాట్లాడుతూ, కొన్ని మీడియా రిపోర్ట్స్‌ ప్రయాణీకులను గందరగోళానికి గురిచేస్తున్నాయనీ, ఆ కన్‌ఫ్యూజన్‌ వల్ల ప్రయాణాల్లో తగ్గుదల కనిపించినా, క్రిష్‌ ఐలాండ్‌ సహా పaలు ప్రాంతాలకు బుక్‌ అయిన టిక్కెట్లలో ఎలాంటి క్యాన్సిలేషన్స్‌ లేవని చెప్పారు.

 

--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com