స్కూల్ స్టూడెంట్స్ కోసం ట్రాన్స్‌పోర్ట్ ఫ్లీట్ రెడీ
- September 02, 2019
రియాద్: కింగ్‌డమ్‌కి చెందిన స్కూల్ ట్రాన్స్‌పోర్ట్ ఫ్లీట్, 1.2 మిలియన్ విద్యార్థులకు సేవలందించేందుకు సిద్ధమయ్యింది. మొత్తం 18,000 స్కూళ్ళ కోసం ఈ ఫ్లీట్ రెడీగా వుందని అధికారులు పేర్కొన్నారు. 25,000 బస్‌లు, ఇతర వాహనాలు వీటిల్లో వున్నాయి. ఇందులో 15 శాతం కొత్త బస్‌లు. 28,000 మంది డ్రైవర్లు, టెక్నీషియన్లు, అడ్మినిస్ట్రేటర్స్ ఫ్లీట్ అబ్జర్వర్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ ఫ్లీట్ కోసం సిద్ధం చేశారు. మొత్తం 9 మిలియన్ ట్రిప్‌లు ఈ ఏడాది ఈ ఫ్లీట్ ద్వారా నిర్వహించనున్నారు. తత్వీర్ ఎడ్యుకేషన్ హోల్డింగ్ కంపెనీ (మినిస్ట్రీకి చెందిన ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ ప్రొవైడర్) ఈ ఫ్లీట్‌ని నిర్వహిస్తుంది. విద్యార్థులు క్షేమంగా స్కూళ్ళకు వెళ్ళి, తిరిగి ఇంటికి చేరుకోవడంలో ఈ ఫ్లీట్ ఎంతగానో ఉపకరిస్తుంది. కాగా, 4,500 బస్‌లను ఇతర వాహనాల్ని డిజేబిలిటీస్‌తో వున్న విద్యార్థుల కోసం కూడా ఈ ఫ్లీట్‌లో భాగం చేశారు నిర్వాహకులు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..