బిగ్ బాస్ షోలో వరుణ్ వితిక మధ్య భారీ గొడవ...!
- September 04, 2019
బిగ్ బాస్ షో ప్రారంభమై ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకొని ఏడవ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంతో పోలిస్తే బిగ్ బాస్ రేటింగ్స్ తగ్గుతున్నప్పటికీ బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది. ఈ వారం ఎలిమినేషన్ కు రాహుల్ సిప్లిగంజ్, అలీ రేజా, మహేశ్ విట్టా, రవికృష్ణ, శ్రీముఖి నామినేట్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వితిక, వరుణ్ మధ్య గొడవకు కారణమైంది.
మొదట బిగ్ బాస్ ఇంట్లోకి దొంగలు వచ్చి ఇంట్లోని వస్తువుల్ని ఎత్తుకొని వెళ్తారు.బిగ్ బాస్ ఇంటి సభ్యులకు దొంగలు దోచిన నగరం అనే టాస్క్ ఇస్తాడు. బిగ్ బాస్ ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడిపోయి టాస్క్ చేయమని చెబుతాడు. శిల్పా చక్రవర్తి దొంగలరాణిగా రవి, రాహుల్, వరుణ్, శివజ్యోతి, పునర్నవి దొంగలుగా ఒక గ్రూపులో ఉంటారు. నగర వాసులుగా అలీ, శ్రీముఖి, వితిక, బాబా భాస్కర్, హిమజ, మహేశ్ మరొక గ్రూపులో ఉంటారు.
బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య టాస్క్ లో భాగంగా గొడవలు జరుగుతూ ఉండటంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ పిలిచి బిగ్ బాస్ ఇంట్లో హింస ఆమోద యోగ్యం కాదని చెబుతాడు. వితిక చేతిలో ఉన్న గన్ ను వరుణ్ లాక్కోవడానికి ప్రయత్నించి వితిక చేతిలో ఉన్న గన్ ను వరుణ్ తీసుకుంటాడు. తన చేతిలో ఉన్న గన్ లాక్కోవటంతో వితిక వరుణ్ మధ్య గొడవ జరుగుతుంది. వితికను మినిమం కామన్ సెన్స్ ఉండాలని వరుణ్ తిడతాడు.
ఇద్దరి మధ్య గొడవ జరగటంతో శ్రీముఖి ఇద్దరినీ వారించటానికి ప్రయత్నం చేస్తుంది. బిగ్ బాస్ ఇంట్లో హింస జరగకూడదని చెప్పినప్పటికీ ఇంటి సభ్యుల మధ్య ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈరోజు కూడా ఈ టాస్క్ కొనసాగే అవకాశం ఉంది. మరి ఈరోజు ఈ టాస్క్ లో ఇంటి సభ్యుల మధ్య ఇంకెన్ని గొడవలు జరుగుతాయో చూడాలి.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







