బీట్‌రూట్‌ కుర్మా

- January 08, 2016 , by Maagulf
బీట్‌రూట్‌ కుర్మా

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ దుంపలు - మూడు, ఉల్లిపాయలు - రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్‌స్పూను, గరంమసాల - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, కారం - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, నూనె - తగినంత. పెరుగు - ఒక కప్పు.

తయారుచేయు విధానం: ముందుగా బీట్‌రూట్‌ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడికించిన నీళ్లను పక్కనపెట్టుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయాలి. చిటపటలాడిన తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఎర్రగా వేయించాలి. అందులోనే ఉప్పు, కారం, గరం మసాల వేసి ఉడికించిన బీట్‌రూట్‌ ముక్కల్ని కూడా వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి ఉడికిన తర్వాత చివర్లో పెరుగు వేసి దించేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com