మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్స్‌పై ఫ్లై దుబాయ్ నిషేధం
- September 09, 2019

ఎమిరేట్స్, ఎతిహాద్‌లతోపాటుగా ఫ్లై దుబాయ్ కూడా మ్యాక్ బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లను చెక్‌డ్ లగేజ్ అలాగే క్యారీ ఆన్ లగేజ్‌లలో నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 2015 - ఫిబ్రవరి 2017 మధ్య తయారైన ల్యాప్‌టాప్‌లలో సాంకేతిక సమస్య కారణంగా వాటిని విమానాల్లో నిషేధిస్తున్నారు. బ్యాటరీ మార్పు జరిగితే తప్ప వీటిని విమానాల్లోకి అనుమతించడంలేదు. మ్యాక్‌బుక్ ప్రో రీకాల్‌కి సంబంధించి వినియోగదారులు తగిన చర్యలు తీసుకుంటే విమానాల్లో అనుమతిస్తారు. ఈ మ్యాక్ బుక్ ప్రో బ్యాటరీలు అధిక వేడిమిని జనరేట్ చేయడం, ఆ తర్వాత అగ్ని ప్రమాదానికి గురి కావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తయారీ సంస్థ రీ-కాల్ చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







