ఆ విషయంలో తెలంగాణ నెంబర్ వన్:గవర్నర్
- September 10, 2019
హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వ పథకాలు, విధానాలపై గవర్నర్ తమిళసై.. ప్రశంసల వర్షం కురిపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు పథకాలను అద్భుతమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మానవ నిర్మిత అద్భుతమంటూ కితాబిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో తాను భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళసై.
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలు బాగున్నాయన్నారు. బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని, దేశంలోనే గొప్ప రాష్ట్రంగా నిలిచిపోతుందని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్రం 14.84 శాతం వృద్ధి రేటు సాధించిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి చేపడుతున్న 30 రోజుల ప్రణాళిక ఓ మంచి కార్యక్రమం అని ప్రశంసించారు. పాలమూరు-రంగారెడ్డి పథకంతో కృష్ణా జలాలను గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నామని వివరించారు. ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో హైదరాబాద్ రికార్డులు నెలకొల్పిందన్నారు గవర్నర్. సేవల రంగంలో హైదరాబాద్ అద్భుతంగా పురోగతి కనిపిస్తుందన్నారామె. దేశంలో హైదరాబాద్ మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!