గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు – హైదరాబాద్ మేయర్ రామ్మోహన్
- September 10, 2019
గ్రేటర్ హైదరాబాద్ లో ఈ నెల 12న జరిగే గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్టు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లపై జిహెచ్ఎంసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలోని 32 ప్రధాన ప్రాంతాల్లో జరిగే నిమజ్జన కార్యక్రమానికి దాదాపు రూ. 20 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. గణేష్ నిమజ్జనానికి ఈ క్రింది చర్యలు చేపట్టినట్టు తెలిపారు...
- గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే 391 కిలోమీటర్ల మార్గంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక గణేష్ యాక్షన్ టీమ్‌ల ఏర్పాటు.
- ఒక్కో టీమ్‌లో ఒక శానిటరీ సూపర్‌వైజర్ లేదా శానిటరీ జవాన్, ముగ్గురు ఎస్.ఎఫ్.ఏలు, 21మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్ట్‌లుగా పనిచేస్తారు.
- నిమజ్జన ప్రాంతాల్లో 27 ప్రత్యేక వైద్య శిబిరాలు, 92 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరిగింది.
- మొత్తం 194 ఈ గణేష్ యాక్షన్‌టీమ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది.
- పారిశుధ్య కార్యక్రమాలకు 481మంది సూపర్‌వైజర్లు, 719 ఎస్.ఎఫ్.ఏలు, 9,849 పారిశుధ్య కార్మికులను నియమించాం.
- గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ద్వారా దాదాపు రూ.20 కోట్ల తో విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది.
- నిమజ్జనం సాఫీగా జరగడానికి 32 ప్రాంతాల్లో 93 స్టాటిక్ క్రేన్‌లను, 134 మొబైల్ క్రేన్‌ల ఏర్పాటు.
- క్రేన్లు ఏర్పాటు నీటి పారుదల శాఖ ద్వారా కాకుండా ఈసారి జిహెచ్ఎంసి ద్వారా ఏర్పాటు చేస్తున్నాం.
- ఇప్పటికే జిహెచ్ఎంసి ద్వారా నిర్మించిన 23 గణేష్ నిమజ్జన కొలనులలో శుభ్రమైన నీటిని నింపి నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.
- గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారులలో రోడ్ల రీ-కార్పెటింగ్, మరమ్మత్తులు, పూడ్చివేత తదితర పనులకు రూ. 9.29 కోట్లతో 176 పనులు మంజూరు చేయడం జరిగింది.
- ఎస్ ఆర్ డి పి జరిగే మార్గాల్లో రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాం.
- నిమజ్జనం జరిగే అన్ని చెరువుల వద్ద భద్రత నిమిత్తం గజ ఈతగాళ్లను నియమించడం జరుగుతుంది.
- జిహెచ్ఎంసి విద్యుత్ విభాగం ద్వారా 36,674 తాత్కాలిక లైట్లు రూ. 99.41 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నాం.
- నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరుగుతుంది.
- నిమజ్జనం జరిగిన వెంటనే చెరువుల నుండి విగ్రహాలను తొలగించడం జరుగుతుంది.
- రోడ్లు భవనాల శాఖ ద్వారా 12 కిలోమీటర్ల మేర భారీకేడింగ్ చేయడం జరుగుతుంది.
- శోభాయాత్ర మార్గంలో 15 కేంద్రాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్‌లను వేయడం జరుగుతుంది.
- రోడ్లు, భవనాల శాఖ ఎలక్ట్రిక్ విభాగం ఆధ్వర్యంలో 75 జనరేటర్లు ఏర్పాటు.
- హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హుసేన్ సాగర్ చెరువు నుండి నిమజ్జనం ద్వారా వచ్చే వ్యర్ధాలను తొలగించడానికి వెయ్యి మందిని ప్రత్యేకంగా నియమాకం.
- జలమండలి ప్రత్యేకంగా 115 వాటర్ క్యాంప్ ల ద్వారా 30,52,000 వాటర్ ప్యాకెట్ ల అందజేత.
- 30 లక్షల వాటర్ ప్యాకెట్లను అందించనున్నాం.
- నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గంలో 36 ఫైర్ ఇంజన్ల ఏర్పాటు.
- సరూర్‌నగర్, కాప్రా, ప్రగతి నగర్ చెరువుల వద్ద ప్రత్యేకంగా 3 బోట్లను ఏర్పాటు చేస్తున్నాం.
- ట్యాంక్ బండ్, సరూర్‌నగర్ వద్ద కేంద్ర విపత్తు నివారణ దళాలను ఏర్పాటు చేస్తున్నాం.
- పర్యాటక శాఖ ద్వారా హుసేన్ సాగర్ చెరువులో7 బోట్లను ఏర్పాటు చేస్తున్నాం.
- మరో 4 స్పీడ్ బోర్డ్ లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. హుస్సేన్ సాగర్ లో పదిమంది గజ ఈత గాళ్లను ఏర్పాటు.
- విద్యుత్ శాఖ ద్వారా హుస్సేన్ సాగర్ చుట్టూ 48 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు.
- సరూర్‌నగర్ చెరువు వద్ద 5 ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు.
- నగరంలోని పలు ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు మొత్తం 101 అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు.
- నిమజ్జన మార్గాల్లో 37,674 అదనపు లైట్ల ఏర్పాటు.
- నిమజ్జన శోభయాత్ర మార్గంలో చెట్ల ప్రూనింగ్ చేయడం జరిగింది.
- ప్రతి సర్కిల్ లో ఒక ఎమర్జెన్సీ హార్టికల్చర్ టీమ్ నియామకం.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







