ప్రపంచమంతా ఎదురుచూసిన కొత్త ఐఫోన్ వచ్చేసింది..
- September 11, 2019
ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న కొత్త ఐఫోన్‌లను యాపిల్ విడుదల చేసింది. ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ అధునాతన స్మార్ట్‌ఫోన్‌లను యాపిల్ స్టీవ్ జాబ్స్ ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ఆవిష్కరించారు. ఐఫోన్ 11.. ఆరు రంగుల్లో లభ్యం కానుంది. కొత్తగా గ్రీన్, పర్పుల్, రెడ్, యెల్లో రంగుల్లో వచ్చింది. స్పెషల్ ఆడియో, డాల్బీ అట్మోస్ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 6.1 లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే, స్లో మోషన్ సెల్ఫీలు, ఏ13 బయోనిక్ చిప్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 11 ధర 699 డాలర్ల నుంచి మొదలవుతుంది.
ఐవాచ్ సిరీస్ 5ను కూడా కంపెనీ తీసుకొచ్చింది. మామూలు వాచ్‌లాగానే ఎప్పుడూ డిస్‌ప్లే కంటికి కనిపించేలా ఐ వాచ్ సిరీస్ 5ను ఆవిష్కరించింది. ఈ వాచ్‌లో కంపాస్ కూడా ఉంటుంది. 399 డాలర్లతో ధర మొదలువుతుంది. ఏడో జనరేషన్ ఐప్యాడ్‌లను కూడా యాపిల్ ప్రవేశపెట్టింది. ఇది 329 డాలర్లుగా ఉంది. ఈ నెల 30 నుంచి కొత్త ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
నెట్‌ఫ్లిక్స్ తరహా స్ట్రీమింగ్ వీడియో సర్వీస్, ఆపిల్ టీవీని యాపిల్ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఆపిల్ టీవీ ద్వారా ఓఫ్రా విన్‌ఫ్రే, జెన్నిఫర్ అనిస్టిన్ తదితర స్టార్స్ నటించిన ఒరిజినల్ ప్రోగ్రామ్స్‌ను ప్రసారం చేస్తుంది. వంద దేశాల్లో ఈ సర్వీస్ నవంబర్ 1 నుంచి లభించనున్నది. సబ్‌స్క్రిప్షన్ నెలకు 5 డాలర్లు ఉంటుంది. కొత్త ఐఫోన్‌లు, ఐపాడ్‌లు కొన్నవాళ్లకు ఏడాది పాటు సర్వీస్‌ను ఉచితంగా అందిస్తారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







