ఒమన్‌ ట్రక్‌ యాక్సిడెంట్‌: ఒకరి మృతి, మరొకరికి గాయాలు

ఒమన్‌ ట్రక్‌ యాక్సిడెంట్‌: ఒకరి మృతి, మరొకరికి గాయాలు

మస్కట్‌: అల్‌ అమెరాత్‌ రైజ్‌ రోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గాయాల పాలయ్యారని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. ఓ వాహనాన్ని ఢీకొన్న ట్రక్‌ ఓవర్‌ టర్న్‌ అయిన ఘటనకు సంబంధించి పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో ట్రక్‌ డ్రైవర్‌ మృతి చెందగా, కారు డ్రైవర్‌ గాయాల పాలయ్యారు. గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా అకాబత్‌ అమెరాత్‌ రోడ్డుపై ట్రాపిక్‌ సమస్య తలెత్తింది.

 

Back to Top