మహేష్ బాబు 'మగాడు'...
- May 16, 2015
మహేష్,కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి గత కొంతకాలంగా 'శ్రీమంతుడు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టడం లేదు. 'మగాడు' అనే టైటిల్ ఖరారు చేసారు. గత రెండు మూడు రోజులు గా ఈ చిత్రానికి 'మగాడు' అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా 'మగాడు' టైటిల్ పెడుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ధృవీకరించారు. మే 31 న 'మగాడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నారు. మే 31 ...మహేష్ తండ్రి కృష్ణ జన్మదినం. ఈ సందర్భంగా మహేష్‌బాబు కొత్త సినిమాకి సంబంధించిన తొలి ప్రచార చిత్రం విడుదల కాబోతోంది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాని జూలైలో రిలీజ్ చెయ్యాలని ముందుగా ప్లాన్ చేసుకొని జూలై 17వ తేదీని ఈ సినిమా రిలీజ్ కోసం లాక్ చేసారు. కానీ గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో పెండింగ్ వర్క్ ఇంకా చాలా ఉండండం వలన ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో 'బాహుబలి' సినిమా రిలీజ్ కూడా ఉండటంతో అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా? లేదా? అనేది సందేహంగా మారింది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత 'బ్రహ్మోత్సవం' స్టార్ట్ చేశారు. మే నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







