హైదరాబాదీని చంపిన పాకిస్తానీ
- September 13, 2019
లండన్:అనుమానం పెనుభూతమైంది. తన భార్యతో వివేహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో పాకిస్థానీ వ్యక్తి హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని అంతమొందించాడు.. దీంతో అతనికి యావజ్జీవ శిక్ష విధించింది లండన్ కోర్టు.. హైదరాబాద్ కు చెందిన నదీమ్ ఉద్దీన్ హమీద్ మొహమ్మద్ (26) కొన్నేళ్లుగా లండన్ లో ఉంటున్నాడు. అతనికి ఏడాది కిందటే వివాహం జరిగింది. అయితే అతను పనిచేస్తున్న కంపెనీలో సహోద్యోగి పెర్విజ్ (27)తో పరిచయం ఏర్పడింది. పెర్విజ్ పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం అతను యూకే పౌరసత్వం కలిగివున్నాడు. అప్పుడప్పుడు మొహమ్మద్..ఇంటికి వస్తుండటంతో తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని పెర్విజ్ అనుమాన పడ్డాడు.
దాంతో ఈ ఏడాది మే లో మొహమ్మద్ ను పదునైన కత్తితో అందరూ చూస్తుండగానే లండన్ పురవీధుల్లో దారుణంగా నరికి చంపాడు. అతను మరణించేనాటికి మృతుడి భార్య ఎనిమిది నెలల గర్భిణీ. ఈ కేసులో తీర్పు వెల్లడించిన కోర్టు.. నిందితుడు పెర్విజ్ కు యావజ్జీవ శిక్ష విధించింది. అంతేకాదు ఒకవేళ పెరోల్ కావాలనుకుంటే అతను కనీసం 22 సంవత్సరాల శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. పదునైన ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు మరో 18 నెలల శిక్ష కూడా విధించింది. ‘మీ భార్య, కుటుంబ సభ్యులు, మరణించిన మొహమ్మద్‌లు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని ఎంత చెప్పినా వినలేదు’ అని తీర్పులో పేర్కొంది లండన్ కోర్టు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







