టెర్రరిజం: ఇద్దరికి మూడేళ్ళ జైలు, 100,000 దినార్స్ జరీమానా
- September 13, 2019
బహ్రెయిన్:తీవ్రవాదం అభియోగాల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులకు మూడేళ్ళ జైలు శిక్షతోపాటు 100,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది ఫోర్త్ హై క్రిమినల్ కోర్ట్. ఈ కేసులో ఓ వ్యక్తిని నిర్దోషిగా న్యాయస్థానం తేల్చిందని అడ్వొకేట్ జనరల్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు. టెర్రర్ గ్రూప్ సరాయా అల్ అష్తార్‌కి చెందిన నిందితుడు, మరో టెర్రర్ గ్రూప్‌తో కలిసి తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడు, వివిధ కేసుల్లో జైళ్ళలో మగ్గుతున్నవారి కుటుంబాల మద్దతుని సైతం నిందితుడు పొందినట్లు అధికారులు విచారణలో తేల్చారు. ఈ కేసులో మూడో అనుమానితుడు మొదటి నిందితుడు రెండో నిందితుడికి మధ్య మనీ హ్యాండ్లర్‌గా వ్యవహరించినట్లు అభియోగాలు ఎదుర్కొన్నాడు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







