సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో `ఉల్లాలా ఉల్లాలా`
- September 13, 2019
సీనియర్ నటుడు సత్యప్రకాష్ పేరు చెప్పగానే `పోలీస్ స్టోరీ` సినిమా గుర్తుకొస్తుంది. ఈ ఒక్క సినిమా అనే కాదు, ఎన్నో ఎన్నెన్నో సూపర్ హిట్ సినిమాల్లో ప్రతినాయకుడిగానూ, ముఖ్య పాత్రధారిగానూ రాణించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. 11 భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించిన ఈ సీనియర్ నటుడు తొలిసారిగా మెగాఫోన్ చేతబట్టారు. సత్యప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పేరు `ఉల్లాలా ఉల్లాలా`. గత వేలంటైన్స్ డేకి భారీ ఎత్తున `లవర్స్ డే` చిత్రాన్ని విడుదల చేసి మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుఖీభవ మూవీస్ అధినేత ఎ.గురురాజ్ `ఉల్లాలా ఉల్లాలా` చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ ``తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ, పంజాబీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 500కు పైగా సినిమాల్లో నటించాను. `పోలీస్ స్టోరీ`, `సీతారామరాజు`, `పెళ్లి చేసుకుందాం`, `సమర సింహారెడ్డి`, `మాస్టర్`, `డేంజర్`, `లాహిరి లాహిరి లాహిరిలో`, `బిగ్ బాస్` తదితర చిత్రాలు నాకెంతగానో పేరు తెచ్చిపెట్టాయి. ఇన్నేళ్ల కెరీర్‌లో నటుడిగా పూర్తిస్థాయి సంతృప్తితో ఉన్నాను. దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనింగ్ థ్రిల్లర్. ఈ సినిమాలో చాలా వింతలూ విశేషాలూ ఉన్నాయి. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ సినిమా ఉంటుంది. మేకింగ్ పరంగా కూడా చాలా కొత్తగా ఉంటుంది. దర్శకునిగా నా తొలి చిత్రానికి గురురాజ్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం`` అని చెప్పారు.
నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ ``సత్యప్రకాష్ నాకెప్పటి నుంచో మంచి స్నేహితుడు. నటునిగా అతనిలో ఎంత ఫైర్ ఉందో, దర్శకునిగా అంతకు మించిన ఫైర్ ఉంది. ఈ చిత్రానికి నేనే కథను అందించాను. మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. `ఉల్లాలా ఉల్లాలా` చిత్రం నిర్మాతగా నాకు, దర్శకునిగా సత్యప్రకాష్‌కూ కచ్చితంగా ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది. షూటింగ్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం`` అని తెలిపారు.
తారాగణం
నటరాజ్, నూరిన్, అంకిత, గురురాజ్, సత్యప్రకాష్, `బాహుబలి` ప్రభాకర్, పృథ్వీరాజ్, `అదుర్స్` రఘు, జబర్ధస్త్ నవీన్, లోబో, మధు, జబర్ధస్త్ అప్పారావు, రాజమౌళి, జ్యోతి, గీతాసింగ్, జయవాణి తదితరులు
సాంకేతిక నిపుణులు
సమర్పణ: శ్రీమతి ఎ.ముత్తమ్మ,
ఛాయాగ్రహణం: జె.జి.కృష్ణ, దీపక్,
సంగీతం: జాయ్,
ఎడిటింగ్: ఉద్ధవ్,
నృత్య దర్శకత్వం: శేఖర్ మాస్టర్, దిలీప్ కుమార్,
యాక్షన్: డ్రాగన్ ప్రకాష్,
ఆర్ట్: కె.మురళీధర్,
పాటలు: కాసర్ల శ్యామ్, గురుచరణ్,
కథ - నిర్మాత: ఎ.గురురాజ్,
స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: సత్యప్రకాష్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







