ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 6.53లక్షల ఫైన్!!
- September 15, 2019
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ లారీ డ్రైవర్‌కి దిమ్మదిరిగిపోయే రీతిలో ఫైన్ వేశారు ఒడిశా రవాణా శాఖ అధికారులు. మొత్తం ఏడు నియమాల ఉల్లంఘనలకు గానూ దిలీప్ కర్తా అనే డ్రైవర్‌కు సంబల్‌పూర్ ఆర్టీఏ అధికారులు చలానా జారీ చేశారు. ఆ చలానా చూసి షాక్ అయ్యాడు దిలీప్. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
నాగాలాండ్‌కు చెందిన ఆ లారీకి పత్రాలు సరిగాలేవు. గత ఐదేళ్లుగా రోడ్డు ట్యాక్స్ కట్టడంలేదు. వస్తువులు తరలించే వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాడు. ఇలా తదితర కారణాలు చూపి ఆ లారీకి ఏకంగా రూ.6.53లక్షలు జరిమాన విధించారు. ఆ వాహనానికి వేసిన జరిమానాను చూసిన ట్రక్కు ఓనర్ శైలేష్ శంకర్ నోరెళ్లబెట్టాడు. అయితే ఇదంతా కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత జరిగింది కాదు. ఆగస్టు 10న జరిగిన ఘటన ఇది. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







