బోటు ప్రమాదంపై మోదీ దిగ్బ్రాంతి..
- September 15, 2019
ఢిల్లీ:గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని సహాయక చర్యలను ముమ్మరం చేయాలనీ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.’ అంటూ పేర్కొన్నారు ప్రధాని. ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సీఎం జగన్ తో ఫోనులో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ ద్వారా సహాయక చర్యల గురించి ఆరా తీస్తున్నారు. కాగా బోటులో మొత్తం 71 మంది ఉన్నట్టు తాజాగా తెలిసింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







