చాలా బాధాకరం: ఏపీలో బోటు ప్రమాదంపై రాహుల్ ట్వీట్

చాలా బాధాకరం: ఏపీలో బోటు ప్రమాదంపై రాహుల్ ట్వీట్

రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని, వారి కుటుంబానికి తన సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రాహుల్ రాసుకొచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నదిలో బోటు మునిగిందనే వార్త విన్నాను. నిజంగా ఇది చాలా బాధాకరం. ఈ విషాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను. అంతే కాకుండా గల్లంతైన వారు తొందర్లోనే సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో పర్యాటక బోటు(పున్నమి) మునిగిపోయింది. ఈ ప్రమాదం సమయంలో బోటులో 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గోదావరిలో వరద తగ్గడంతో అధికారులు బోటు పర్యటనకు అనుమతి ఇచ్చారు. దీంతో పున్నమి బోటు ప్రయాణికులతో పాపికొండలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Back to Top