హయ్యర్ స్టడీస్‌లో డ్రాపవుట్స్ ఆందోళనకరం
- January 09, 2016
హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో డ్రాపవుట్స్ ఆందోళనకరంగా ఉన్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 6 శాతం విద్యార్థులు హయ్యర్ స్టడీస్‌లో డ్రాప్‌ఔట్ అవుతున్నారని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు అధికారులు. 2013-14లో హయ్యర్ స్టడీస్‌లో చేరిన విద్యార్థుల్లో ఈ డ్రాప్ ఔట్ రేటు ఎక్కువగా ఉందని హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ రవ్యా సౌద్ అల్ బుసాదీ చెప్పారు. 7,388 మంది స్టూడెంట్స్ ఈ అకడమిక్ ఇయర్‌లో డ్రాప్ అయ్యారనీ, ఇందులో 2,532 మంది మహిళలు కాగా, 4,856 మంది పురుషులు. వీటిల్లో అకడమిక్ ఫెయిల్యూర్ ముఖ్య కారణమనీ, అలాగే బ్యాడ్ బిహేవియర్, చదువు పట్ల అయిష్టత, ఫీజులు కట్టలేకపోవడం వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. డ్రాపవుట్స్‌కి సంబంధించిన కారణాలు వెతికి, వాటిని సరిదిద్దడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తుంది. ఇంకో వైపున డ్రాపవుట్స్ సామాజిక కోణంలోనూ అనేక సమస్యలను తెచ్చిపెడ్తున్నాయనీ, సమర్థులకు అవకాశం దక్కకపోవడం ద్వారా అది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, పూర్తిస్థాయిలో హయ్యర్ ఎడ్యుకేషన్ పట్ల అవగాహన, నిబద్ధత లేకపోవడం ఆయా కుటుంబాల్ని ఆర్థిక సంక్షోభంలో ముంచేస్తున్నాయని వెల్లడయ్యింది. అకడమిక్ సపోర్ట్, కౌన్సిలింగ్ సర్వీసులు, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ వంటి విభాగాల్లో విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం ద్వారా హయ్యర్ ఎడ్యుకేషన్‌లో డ్రాపవుట్స్ తగ్గించవచ్చని మంత్రిత్వ శాఖ ఓ నిర్ణయానికి వచ్చింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







