నాకు మరెవ్వరూ పోటీ కాదు!
- January 09, 2016
ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో మంచి పాత్రలు పోషించే అవకాశం లభించింది. అదంతా నా అదృష్టం. జానపదాలు, పౌరాణికాలు, సోషియో ఫాంటసీ... ఇలా విభిన్నమైన సినిమాలు చేశాను. ఎప్పుడూ నా సినిమాలే నాకు పోటీ అని భావిస్తుంటాను. నాకు మరెవ్వరూ పోటీ కాదు. నేను బతికున్నంతవరకు సినిమాలు చేస్తూనే ఉంటా. నా వారసత్వంగా నా కొడుకు కూడా సినిమాలు చేస్తాడగగన్నారు బాలకృష్ణ.ఆయన కథానాయకుడిగా నటించిన ఖడిక్టేటర్‌గ పాటల విజయోత్సవం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నటీనటులు, సాంకేతిక నిపుణులకు బాలకృష్ణ జ్ఞాపికలు అందజేశారు. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. తమన్ సంగీతమందించారు. ఎరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఖఖనువ్వెంత అనుకునేవాడికి నియంత మా ఖడిక్టేటర్‌గ. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా కచ్చితంగా పండగ ఆనందాన్నిస్తుంది. ఖసింహాగ, ఖలెజెండ్‌గ తరహాలో మరో గొప్ప విజయాన్ని అందించే చిత్రమిది. సినిమాలో సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ నా సంభాషణల్ని నెమరేసుకుంటుంటారు. అదంతా రచయితల గొప్పతనం. తమన్ ఆణిముత్యాల్లాంటి పాటలు అందించాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు చక్కటి సహకారం అందించారు. నేను ఏ సినిమా చేసినా కుటుంబ వాతావరణం ఉండాలి. ఈ సినిమా కూడా అలాంటి వాతావరణంలోనే తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీవాస్ నన్ను మరింత స్టైలిష్‌గా చూపించాడు. అంజలి లాంటి కథానాయికలు దొరికితే అద్భుతాలు సృష్టించొచ్చు. సోనాల్ చౌహాన్ బాగా నటించింది. నవరసాలున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకముందగగన్నారు. శ్రీవాస్ మాట్లాడుతూ ఖఖదర్శకుడిగా, నిర్మాతగా రెండు పాత్రలు పోషించడం కష్టమనుకున్నా. బాలకృష్ణగారు ఉన్నారనే ధైర్యంతో నిర్మాతగా ఈ సినిమా చేశా. మేం పేపరుపై ఏదైతే రాసుకున్నామో దాన్నే పక్కాగా తెరపైకి తీసుకొచ్చాం. బాలకృష్ణగారి అభిమానులకు విందు భోజనంలా ఉంటుందీ చిత్రమగగన్నారు. అంజలి మాట్లాడుతూ ఖఖనాకు బాగా నచ్చిన సినిమా ఇది. బాలకృష్ణగారి 99వ సినిమా ఎలా ఉండాలో అలానే ఉంటుంది. శ్యామ్ కె.నాయుడు ప్రతి ఫ్రేమ్‌ను చాలా అందంగా చూపించారగగన్నారు. ఈ కార్యక్రమంలో చలపతిరావు, సుమన్, చిన్నా, హేమ, శ్రీధర్ సీపాన, అజయ్, కాశీవిశ్వనాథ్, జీవీ, కౌసల్య, శ్యామ్.కె.నాయుడు, గౌతంరాజు, రత్నం, బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









