సెప్టెంబరు 29 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
- September 17, 2019
ఇండియా:అర్థరాత్రి 12 గంటలకు అందరూ నిద్ర పోతుంటే అమెజాన్ సేల్ కోసం కస్టమర్లు మాత్రం మేల్కొనే ఉంటారు. ఓ పది రోజుల ముందే దసరా పండుగ వారి ఇంట్లో సందడి చేయనుంది. 2019 సంవత్సరానికి గాను ఆన్‌లైన్ విక్రేత సంస్థ అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 29 అర్థరాత్రి నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉన్నవారికి మాత్రం సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటల నుంచే సేల్ అందుబాటులో ఉండనుంది. అక్టోబర్ 4 అర్థరాత్రి 12 గంటలకు ఈ సేల్ ముగియనుంది.
ఇక ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు టాప్ బ్రాండ్‌కు చెందిన వస్తువులను అమెజాన్ వినియోగదారులకు పరిచయం చేస్తుంది. ఇందులో వన్‌ప్లస్, శ్యాంసంగ్, వన్‌ప్లస్‌టీవీ, అమెజాన్ బేసిక్స్, మ్యాగి మరికొన్ని కంపెనీలకు చెందిన వస్తువులు ఉన్నాయి. ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో షాపింగ్ చేసిన వారికి 10% డిస్కౌంట్ కూడా అదనంగా లభిస్తుంది. అమెజాన్‌తో పాటు మరో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా ఇదే సమయంలో రంగంలోకి దిగనుంది. బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌తో వినియోగదారులను ఆకర్షించనుంది. అది కూడా అక్టోబర్ 4తోనే ముగుస్తుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







