జీవితం అంటే తెలియని కొన్ని జీవాలు....!!
- January 09, 2016మంచికో చెడుకో ఒకసారి చేయి పట్టుకున్నాక చివరి వరకు విడువను అది తప్పైనా ఒప్పైనా...!! ఇంత మంచి
మనసు ఎంత మందికి ఉంటుంది..?? పెళ్ళి అంటే అదో తంతు, మన గొప్పతనాన్ని చాటుకోవడానికి ఓ ఆడంబరమైన వేదికగా కళ్యాణ వేదికను, మన వెనుక ఉన్న డబ్బును హోదాను చూపించుకోవడానికి మాత్రమే అని అనుకుంటున్న రోజులు ఇవి... పాణిగ్రహణాన్ని, వేద మంత్రాలను వాటి అర్దాల ప్రమాణాలను మరచి పోయి, మన అవసరం కోసమో లేదా ఓ నమ్మకానికి చావు వీలునామా రాయడానికో, మనలోని మరో రూపాన్ని చూపించడానికో, పంతం నెగ్గించుకోవడం కోసం మంచితనం నటించి ఆ నటనలో నలుగురిని నమ్మించి, జతగా వచ్చిన బంధం ఏమైనా పర్లేదు మనం, మన వాళ్ళు బావుంటే చాలు, ఆ మనసు మనిషి ఏమైపోతే మనకెందుకు....మన డాబు దర్పం నలుగురికి కనబడితే సరిపోతుంది...అనుకుంటే ఇక ఈ బంధానికి విలువ, అర్ధం ఉండాలా....!!
ఇచ్చిన మాట తప్పడం అంటే చావుతో సమానం.... అది ఏ విషయంలోనైనా ఒక్కటే....మాట నిలుపుకోలేనప్పుడు అస్సలు మాటే జారకూడదు...కాకపొతే ఇప్పుడు ప్రమాణాలకు ప్రామాణికాలు లేకుండా పోయాయి...డబ్బు,హోదాల కోసం ఒకటేంటి ఆలుబిడ్డలను కూడా అవసరానికి వాడుకునే ఎందరో జాతి రత్నాలు మనకు తారస పడుతూనే ఉన్నారు...మంచితనం ముసుగులో అయిన వాళ్ళను పరాయి వాళ్ళుగా చేసి తామే ప'రాయిగా' అయిపోతూ... తన చుట్టూ చేరే నలుగురు వాళ్ళ అవసరానికి వేసే దండలు గంధపు మాలలుగా మురిసిపోతూ జీవితంలో తామేం కోల్పోతున్నామో....తన కోసం ఎదురుచూసే వారికి ఎంతటి సంతోషాన్ని ఇస్తున్నారో తెలుసుకోకుండా.... కోల్పోతున్న అనుబంధాన్ని తెలుసుకోకుండా... నిరర్ధకమైన జీవితాన్ని చాలా గొప్పగా బతికేస్తున్నా అని సరిపెట్టుకుంటూ అసలు జీవితం అంటే తెలియని కొన్ని జీవాలు....!! మనసును మర్చిపోయిన మనుష్యులు ఎదుటివారి మనసులను కూడా చిద్రం చేసి చోద్యం చూస్తూ నేనే గెలిచాను అనుకుంటే.. అది గెలుపో... లేక తన ఓటమో కూడా తెలియని ఆ మూర్ఖుల మానసిక స్థితిని చూసి నవ్వుకోవడం తప్ప చేయగలిగినది ఏమి లేదు...!!
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు