మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలు పూర్తి

మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలు పూర్తి

అశ్రునయనాల మధ్య మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియలు ముగిశాయి. స్వర్గపురిలో శివప్రసాద్ రావు చితికి నిప్పంటించారు ఆయన కుమారుడు శివరాం. అంతకుముందు అంతిమయాత్రలో భారీగా అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు తదితరులు కోడెల అంతిమయాత్రలో పాల్గొన్నారు. కోడెల అంతిమయాత్ర సందర్బంగా నరసరావుపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ‘పల్నాటి పులి’ కోడెల అమర్ రహే.. అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు అభిమానులు. తమ అభిమాన నేత కోడెల ఇకలేరన్న వార్తను నరసరావుపేట ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం నరసరావుపేటలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు ప్రజలు.

Back to Top