పెట్టుబడుల సదస్సుకు విశాఖ వేదిక...

- January 09, 2016 , by Maagulf
పెట్టుబడుల సదస్సుకు విశాఖ వేదిక...

ప్రతిష్టాత్మకమైన పెట్టుబడుల సదస్సుకు విశాఖ వేదిక కానుంది. నేటి నుంచి మూడు రోజులపాటు ఎపి ఇన్వెస్ట్ మెంట్ సదస్సు జరగబోతోంది. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని పరిశ్రమలశాఖ పేర్కొంది. 2లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు సర్కారు అంచనా వేస్తోంది. విశాఖలో జరిగే సదస్సుకు విదేశీ పారిశ్రామికధిపతులు, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ, సహ బడా పెట్టుబడిదారులు హాజరు కానున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు .... ఆంధ్ర ప్రదేశ్ కు దిశా నిర్దేశం చేసే ముఖ్యమైన పెట్టుబడుల సదస్సు విశాఖలో జరుగుతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు సదస్సు నిర్వహించనున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నేత్రుత్వంలో జరుగుతున్న అతిపెద్ద సమ్మిట్ సన్ రైజ్ ఆంద్రప్రదేశ్ కు వెన్నుదన్నుగా నిలుస్తుందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. సదస్సుకు 41 దేశాలకు చెందిన ప్రతినిధులు .... ఈ సదస్సు ద్వారా ఏపి ప్రభుత్వం ఎంత వరకు పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందనేది తేలాల్సిఉంది. 41 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. పలు ఎంవోయులు సదస్సు జరిగే మూడురోజులు ఉంటాయని ఎపి పరిశ్రమల శాఖ ముఖ్య కారదర్సి ఎస్ ఎస్ రావత్ వివరించారు. 2లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా కార్యాచరణ చేసామన్నారు. ఎపి అభివృద్ధిలో ఈ సదస్సు కీలకంగా మారుతుందని వివరించారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభోపన్యాసం.... తొలిరోజు సదస్సుకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఉపన్యాసం చేస్తారు. రిలయన్స్ ఎడిఎ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ, జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ జిఎం రావు సహ పలువురు పారిశ్రామికవేత్తలు సదస్సులో ప్రసంగించనున్నారు. సదస్సు దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు ... ఇదిలా ఉంటే పెట్టుబడుల సదస్సుకు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మీడియాకు కూడా ఆంక్షలు విధించారు. రోజూ సాయింత్రం ఎపి సిఎం మీడియాకు ఆ రోజు జరిగిన విశేషాలను తెలియజేయనున్నారు. ఇక మంత్రులకు వివిధ సదస్సుకు సంబంధించిన పలు బాధ్యతలను అప్పగించారు. 8మంది కేంద్ర మంత్రులు, 8మంది విదేశీ మంత్రులు కాూడా హాజరవుతున్నారు. ఇన్ ఫ్రా, ఐటీ, ఎనర్జీ, లాజిస్టిక్స్, రిటైల్, హౌసింగ్, తయారీ రంగాలు సహ మరెన్నో రంగాలకు సంబంధించి పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com