పాత ట్రాఫిక్ జరిమానాలకు 50 శాతం రాయితి

- January 09, 2016 , by Maagulf
పాత ట్రాఫిక్ జరిమానాలకు 50 శాతం రాయితి

గత ఏడాది బకాయి పడిన పాత ట్రాఫిక్ జరిమానాలకు 50 శాతం రాయితీను వాహనదారులు ఇకపై చెల్లిస్తే సరిపోతుందని ట్రాఫిక్ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ అవకాశం ఈ ఏడాది ఏప్రిల్ 7 వ తేది లోపు మాత్రమె వర్తిస్తుందని , గత ఏడాది డిసెంబర్ 31 వ తేది లోపున జరిమానాలు విధించబడిన వాహనదారులకి మాత్రమె వర్తిస్తుందని డైరెక్టర్ జనరల్ అఫ్ ట్రాఫిక్ తెలిపారు. 3 నెలల గడువులోపు ఈ సదుపాయంను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రాదర్ వ్యవస్థ ద్వారా నమోదు కాబడిన అన్ని ట్రాఫిక్ అన్ని నిబంధనలు ఈ పరిధి లోనికి వస్తాయని తెలిపారు. బకాయి పడిన పాత ట్రాఫిక్ జరిమానాలను వాహనదారులు ' మొఇ  ఈ- చానల్స్ , మొఇ వెబ్ పోర్టల్ , మెత్రాష్ తో మొబైల్ యాప్స్ స్వయం సేవా కిఒస్కస్, అలాగే, అన్ని ట్రాఫిక్ విభాగ కౌంటర్ల ద్వారా చెల్లించవచ్చు. త్వరలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులో రానున్న నేపధ్యంలో పాత ట్రాఫిక్ జరిమానాలను త్వరితగతిన ముగించేందుకు 50 శాతం రాయతిని ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. ప్రజలందరు రానున్న నూతన ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా పలు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, విలువైన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ట్రాఫిక్ విభాగంతో సహకరించాలని  డైరెక్టర్ జనరల్ అఫ్ ట్రాఫిక్ తెలిపారు.

    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com