జమ్మూలో గవర్నర్ పాలన...
- January 10, 2016
జమ్మూకాశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ అకాల మరణంతో రాష్ట్రంలో గవర్నర్ పాలన చోటు చేసుకుంది. మూడు రోజులపాటు సంతాప దినాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సీఎం పగ్గాలు చేపట్టేందుకు పీడీపీ అధ్యక్షురాలు, ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె మెహబుబా ముఫ్తీ నిరాకరించారు. దీంతో జమ్మూలో గవర్నర్ పాలన విధించారు. మెహబుబాకు మద్దతుపై బీజేపీ తర్జనభర్జనలు ........ అయితే.. మెహబుబా ముఫ్తీకి మద్దతివ్వాలా.. వద్దా అనే అంశంపై బీజేపీ నేతలు తర్జనభర్జనలు పడినట్లు తెలిసింది. అందుకే ఆమె సీఎం పగ్గాలు చేపట్టేందుకు ఆలస్యమయ్యిందనే వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు అధికారాన్ని చేపట్టేందుకు గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా. బీజేపీ, పీడీపీకి లేఖలు రాసినా ఎవరూ ముందుకు రాకపోవడంతో తాజా పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. బాధ నుంచి మెహబుబా తేరుకోలేదంటున్న పార్టీ వర్గాలు ........ మరోవైపు తండ్రిని కోల్పోయిన బాధ నుంచి ఆమె ఇంకా తేరుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విషాదం నుంచి తేరుకునేందుకు మరికొంత సమయం పట్టవచ్చంటున్నారు. అప్పటివరకు గవర్నర్ పాలన కొనసాగనుందని.. ఇందులో రాజ్యాంగ సంక్షోభం ఏమీ ఉండదంటున్నారు పీడీపీ నేతలు. మెహబుబాతో బీజేపీ నేత రాంమాధవ్ భేటీ ...... ఇక ఇప్పటికే మెహబుబాతో బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ భేటీ అయ్యారు. ఆమె సీఎం పదవి చేపట్టేందుకు అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఆమె రేపో, ఎల్లుండో పదవీబాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. ఈమె పదవీ చేపడితే జమ్మూ కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. ఇక మెహబుబాను పరామర్శించేందుకు సోనియాగాంధీ నేడు శ్రీనగర్ వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







