ఖతర్ లో వర్షం నీటిని భద్రపరచే భారీ జలాశయం సిద్ధం
- January 10, 2016
ఖతర్ లో నీటి కొరతను నియంత్రించేందుకు వాన నీటిని నిల్వ ఉంచేందుకు ఒక భారీ జలాశయ సౌకర్యాన్ని ప్రజల కోసం ఏర్పాటు చేయనున్నారు, చివరి దశ నిర్మాణంలో ఉన్న ఈ రిజర్వాయెర్ ' అల్ దాయెన్ ' మునిసిపాలిటి పరిధికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న' అల్ ఖీసా ' ప్రాంతంలో ఉంది. అత్యంత సృజనాత్మక సాకేతిక విలువలతో కూడిన ఈ జలాశయ పథకంలో ఆశ్తర్యకరమైన విషయం ఏమిటంటే, పురపాలక పరిధిలో ఏ మారుమూల ప్రాంతంలో కురిసిన వర్షం నీరైనా ఈ జలాశయం లోనికి నేరుగా ప్రవహించేలా భూగర్బ తూములను ఏర్పాటు చేశారు. ' అల్ ఖీసా ' మునిసిపాలిటి ప్రత్యేక అభివృద్ధిలో భాగంగా ఈ పురపాలక పట్నం ను అభివృద్ధి చేయనున్నారు, , గతంలో హరిత గ్రామంగా ఉండేది. వాన నీటిని నిల్వ ఉంచే, ఈ భారీ జలాశయ పథకంకు ప్రభుత్వం 330 మిల్లియన్ల ఖతర్ రియాళ్ళను ఖర్చు చేయనుంది. ' అల్ ఖీసా ' అనే అరబిక్ పదానికి మన తెలుగులో అర్ధం ' పెద్ద తోట ' , గత ఏడాది డిసెంబర్ 25 వ తేదీన దేశవ్యాప్తం గా. భారీ వర్షాలు కురిశాయి. ' అల్ ఖీసా ' పురపాలక పరిధిలో సైతం పెద్ద వానలు పడ్డాయి. పట్నంలో పలు వీధుల్లో పెద్ద మొత్తంలో వాన నీరు నిల్వ ఉంది. ఈ వాన నీటి విషయమై తక్షణమే స్పందించిన మునిసిపల్ ఇంజీనీరింగ్ విభాగపు సిబ్బంది ఆ మొత్తాన్ని భూగర్భ నీటి తూముల ద్వారా వర్షం నీటిని భద్రపరచే భారీ జలాశయం వైపునకు పంపింగ్ చేశారు. ఆ, తోడబడిన వాన నీటి పరిమాణం 28మిల్లియన్ల గ్యాలన్లుగా నమోదు కాబడింది. ఈ నీటి మొత్తాన్ని , 40 పెద్ద ఒలింపిక్ ఈత కొలనులతో సరిపోల్చవచ్చు. ఈ భారీ జలాశయ పథకం 2014 మొదటి త్రైమాసికంలో ' ఆల్ఘల్ ప్రజా పనుల సంస్థ ' చేత నిర్మాణం మొదలుకాబడింది. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తి కాబడినట్లు అధికారులు వివరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







