యూఏఈలో భారత కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ పర్యటన
- September 24, 2019
భారత కేంద్ర మంత్రి పియుష్ గోయెల్, యూఏఈలో రెండు రోజుల పర్యటన కోసం విచ్చేశారు. ఆయనకు ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ డెలిగేషన్ స్వాగతం పలికింది. దుబాయ్ ఎక్స్పో 202లో ఇండియా పెవిలియన్‌ని ఆయన ప్రారంభించారు. ఈ పర్యటన సందర్భంగా పియుష్ గోయెల్‌తో ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ డెలిగేషన్ సమావేశమయ్యింది. ఐపీఎఫ్ ప్రెసిడెంట్, నేషనల్ కన్వీనర్ భూపేంద్ర కుమార్, ఐపీఎఫ్ యాక్టివిటీస్ గురించి వివరించారు. కాన్సుల్ వ్యవహారాలు, కల్చర్ ఎక్స్ఛేంజ్ వంటి విషయాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఐపీఎఫ్ దుబాయ్ ప్రెసిడెంట్ రమేష్ మన్నాథ్, వైస్ ప్రెసిడెంట్ జనగాం శ్రీనివాస్, ఐపీఎఫ్ షార్జా ప్రెసిడెంట్ విజయన్ నాయర్, జనరల్ సెక్రెటరీ సురేష్ కాశి, ఐపీఎఫ్ అజ్మన్ ప్రెసిడెంట్ రాధిష్ నాయర్, ఐపీఎఫ్ విమెన్ వింగ్ కో-ఆర్డినేటర్ శిల్పా నాయర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, ఐపీఎఫ్ టీమ్ సేవల్ని కొనియాడారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..