ఒమన్‌లో రోడ్డు పాక్షికంగా మూసివేత

- September 27, 2019 , by Maagulf
ఒమన్‌లో రోడ్డు పాక్షికంగా మూసివేత

మస్కట్‌: అల్‌ అమెరిఆత్‌లోని జహ్‌లౌట్‌ రోడ్‌ని పాక్షికంగా మూసివేస్తున్నారు. రెగ్యులర్‌ మెయిన్‌టెనెన్స్‌ కోసం ఈ చర్యలు చేపట్టినట్లు మస్కట్‌ మునిసిపాలిటీ పేర్కొంది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ట్రాఫిక్‌ విభాగంతో కలిసి మస్కట్‌ మునిసిపాలిటీ, ఈ రోడ్డుని గురువారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు మూసివేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, ట్రాఫిక్‌ సిబ్బంది సూచనల మేరకు వాహనాలు నడపాలని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com