ఇన్నోవేషన్‌ అవార్డ్‌ అందుకున్న బాటెల్కో

- September 27, 2019 , by Maagulf
ఇన్నోవేషన్‌ అవార్డ్‌ అందుకున్న బాటెల్కో

బాటెల్కో, ది ఇన్నోవేషన్‌ అవార్డ్‌ - ఆపరేటర్‌ని టెలికామ్స్‌ వరల్డ్‌ మిడిల్‌ ఈస్ట్‌ 2019 అవార్డుల ప్రదానోత్సవంలో గెల్చుకుంది. దుబాయ్‌లోని కోనార్డ్‌ హోటల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. హై సెక్యూర్‌ టైర్‌ 3 డేటా సెంటర్‌ - కెరీర్‌ న్యూట్రల్‌ డిజిటల్‌ బిజినెస్‌ ప్లాట్‌ఫామ్‌ని ఏర్పాటు చేసినందుకుగాను గ్లోబల్‌ జోన్‌ బాటెల్కోని ఈ అవార్డుతో గౌరవించింది. బాటెల్కో సీఈఓ మిక్కెల్‌ వింటర్‌ మాట్లాడుతూ, తమ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కిందనీ, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. టెలికాం ఇండస్ట్రీ ఆపరేటర్స్‌కి ప్రతి యేడాదీ టెలికామ్స్‌ వరల్డ్‌ మీడియల్‌ ఈస్ట్‌ అనేది అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల ఈవెంట్‌గా కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com