ఐఎస్‌ఎస్‌లోని యూఏఈ ఆస్ట్రోనాట్‌తో షేక్ మొహమ్మద్ సంభాషణ
- September 27, 2019
యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్ మన్సూరి ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వున్నారు. సోయుజ్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన హజ్జా, అక్కడే ప్రయోగాలు చేపడుతున్నారు. కాగా, హజ్జా అల్ మన్సూరితో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా హజ్జా మాట్లాడుతూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి చాలా అందంగా కన్పిస్తోందని, దుబాయ్‌లోని పామ్ ఐలాండ్స్ ఇంకా అందంగా కనిపిస్తున్నాయని చెప్పారు. రాకెట్ నింగిలోకి దూసుకెళుతున్నప్పుడు ఎలా అనిపించింది.? అనడిగితే, ఆ సమయంలో చాలా ఒత్తిడిగా అనిపించిందనీ, అయితే చాలా అద్భుతమైన అనుభూతి అనీ హజ్జా చెప్పారు. అల్లాకి అలాగే షేక్ మొహమ్మద్‌కీ ఈ సందర్భంగా హజ్జా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







