తెలంగాణ:ఆదివారం నుంచి సచివాలయానికి తాళం
- September 27, 2019
హైదరాబాద్ : తెలంగాణ ప్రస్తుత సచివాలయానికి తాళం పడనుంది. ఇందుకు ముహూర్తం ఆదివారం ఉదయం పదిన్నర గంటలు. ఈ సచివాలయాన్ని పూర్తిగా తొలగించి, దాని స్థానంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ క్రమంలో... సచివాలయంలోని అన్ని శాఖలూ ఇప్పటికే బీఆర్కే భవన్‌తోపాటు మరికొన్ని భవనాలకు తరలిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇక సచివాలయానికి పూర్తి స్థాయిలో ఆదివారం నుంచి తాళం పడనుంది. సచివాలయాన్ని ఖాళీ చేసి వెంటనే వెళ్ళపోవాలంటూ అన్ని శాఖలకూ సాధారణ పరిపాలనా శాఖ నుంచి శుక్రవారం ఆదేశాలందాయి. సచివాలయం నుంచి శాఖల తరలింపు ప్రక్రియ ఇప్పటికే 90 శాతం పూర్తైంది. ఆదివారం సాయంత్రానికి తరలింపు ప్రక్రియ పూర్తి కానుంది. కాగా ఆదివారం నుంచి సచివాలయానికి తాళం పడనున్న నేపధ్యంలో... సాధారణ పరిపాలనా శాఖ సిబ్బంది బృందాలుగా విడిపోయి శుక్రవారం మధ్యాహ్నం నుంచి అన్ని బ్లాకులనూ చుట్టబెట్టారు. ఆయా శాఖల సిబ్బందిని వెంటనే బీఆర్కేఆర్ భవనానికి తరలిపోవాలని సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది సూచించారు. ఆదివారం ఉదయం పాత సచివాలయ ప్రాంగణం ప్రధాన ద్వారానికి సాధారణ పరిపాలన శాఖ అధికారులు తాళాలు వేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర తాళంచెవి ఉంటుందని, అవసరం ఉన్నవాళ్లు తాళాలను సీఎస్ దగ్గరి నుంచే తీసుకోవాల్సి ఉంటుందని జీఏడీ అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







