టీ కంటే డికాక్షన్ బెటర్...
- September 28, 2019
మీరు రెగ్యులర్‌గా టీ తాగుతారా... రోజుకు మూడు నాలుగు టీలు తాగుతారా... అయితే మీరు మీ టీలో స్వల్ప మార్పులు చేసుకుంటే... ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే పాలు కలిపిన టీ తాగేవారి కంటే... పాలు కలపకుండా... టీ-నీరు (టీ డికాక్షన్ - decoction) తాగేవారి బ్రెయిన్ బాగా పనిచేస్తుందనీ, ఎక్కువగా తేనీరు తాగుతున్నవారి బ్రెయిన్‌లో అంశాల్ని గ్రహించే శక్తి బాగా పెరుగుతోందని పరిశోధనలో తేలింది. మనందరం పాలు కలిపిన టీనే ఇష్టపడి తాగుతాం. ఎందుకంటే పాలు కలపకపోతే... డికాక్షన్ కాస్త చేదుగా ఉంటుంది. అది మనకు నచ్చదు. కానీ... అదే మన బ్రెయిన్‌కి మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. టీ తాగేవారి కంటే తరచూ తేనీరు తాగేవారిలో అవగాహన, గ్రాహణ శక్తి ఆరోగ్యకరంగా ఉంటుందని వాళ్లు చెబుతున్నారు.
అధ్యయనం ఎలా జరిగింది : తరచూ తేనీరు తాగేవారినీ, తాగనివారినీ... మొత్తం 36 మంది ముసలివాళ్లను లెక్కలోకి తీసుకున్నారు. వాళ్ల బ్రెయిన్స్ ఎలా పనిచేస్తున్నారో తెలుసుకున్నారు. డికాక్షన్ తాగేవారి బ్రెయిన్... ముసలితనంలో కూడా చురుగ్గానే ఉన్నట్లు సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ పరిశోధకులు గుర్తించారు. రెగ్యులర్‌గా తేనీరు తాగితే... బ్రెయిన్ పనితీరును అది పెంచడమే కాక... రక్షణ కవచంలా ఉంటుందని చెబుతున్నారు.
నిజానికి టీ కంటే... డికాక్షన్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మన ఆరోగ్యం మెరుగవ్వడమే కాదు... గుండె జబ్బులను కూడా టీ-నీరు పోగొడుతుంది. తాజా సర్వే అంత ఈజీగా చేసినదేమీ కాదు. 2015 నుంచి 2018 వరకూ ఏకంగా మూడేళ్ల పాటూ అధ్యయనం చేశారు. అత్యంత లోతుగా పరిశీలించారు. 60 ఏళ్లు దాటిన ముసలివాళ్ల జీవన శైలి, వారి ఆరోగ్యం, మానసిక స్థితి ఇలా అన్నింటినీ లెక్కలోకి తీసుకున్నారు. కాబట్టి... ఇకపై మనం పాలు కలిపిన టీ కంటే... డికాక్షన్ తాగేందుకు సిద్ధపడితే మంచిదే. చేదుగా ఉంటుందనుకుంటే... అందులో తేనె, చక్కెర వంటివి వేసుకోవచ్చు. అది కూడా మన వల్ల కాదనుకుంటే... గ్రీన్ టీ, బ్లాక్ టీ లాంటివి తాగొచ్చు. అవి కూడా దాదాపు డికాక్షన్ లాంటివే కాబట్టి అవే ప్రయోజనాలు కలుగుతాయి. వారానికి 4 సార్లు గ్రీన్ టీ, బ్లాక్ టీ లాంటివి తాగేవాళ్ల బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తోందని చాలా పరిశోధనల్లో తేలింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!