విశాఖలో రూ.5 వేల కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనున్న రిలయన్స్

- January 10, 2016 , by Maagulf
విశాఖలో రూ.5 వేల కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనున్న రిలయన్స్

విశాఖపట్నం జిల్లాలోని రాంబిల్లిలో రూ.5 వేల కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు రిలయన్స్ గ్రూప్‌ ఛైర్మన్ అనిల్‌ అంబానీ ప్రకటించారు. విశాఖపట్నంలో ఆదివారం ప్రారంభమైన సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో ఆయన ప్రసంగించారు. రిలయన్స్ గ్రూపు రక్షణ రంగంలో పెట్టుబడులను విస్తరిస్తోందని, అందులో భాగంగా తూర్పు తీరంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామన్నారు. దీంతో పాటు రక్షణ రంగానికి అవసరమైన ఇతర పరికరాలు తయారు చేయడానికి మరో రూ.10 వేల కోట్లను దశల వారీగా పెట్టుబడి పెడతామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అనిల్‌ అంబానీ పారశ్రామిక వేత్తలకు పిలుపు నిచ్చారు. హైదరాబాద్‌లో బిజినెస్‌ స్కూల్‌ చంద్రబాబు హాయాంతోనే ఖ్యాతి పొందిదని అనిల్ అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com