దుబాయ్‌లో రోడ్ యాక్సిడెంట్: 8 మంది మృతి, ఆరుగురికి గాయాలు
- September 30, 2019
దుబాయ్‌లో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. షార్జా వైపుగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిర్దిఫ్ సిటీ సెంటర్ ఎగ్జిట్‌కి దగ్గరలో జరిగిన ఈ ప్రమాదంలో 14 సీటర్ మినీ బస్, హెవీ లారీని ఢీకొంది. బస్ డ్రైవర్, ఏడుగురు ప్రయాణీకులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ప్రయాణీకులకు తీవ్ర గాయాలు కాగా, నలుగురికి ఓ మోస్తరుగా గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారంతా ఆసియా జాతీయులేనని దుబాయ్ పోలీస్ వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







